సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ మొదట అతనుండి మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది కూలీ. సెకండాఫ్ చాలా చప్పగా సాగిందనే విమర్శలు వచ్చాయి. కానీ అవేవి కూలీ కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు.
Also Read : Suriya64 : వెంకీ అట్లూరి – సూర్య ‘టైటిల్’ ఇదే
మొదటి రోజు ఏకంగా రూ. 151 కోట్లతో హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది కూలీ. ఇక నిన్నటి ఆదివారం నాటికి మొదటి వీకెండ్ ను పూర్తీ చేసుకుంది కూలీ. రిలీజ్ అయి నాలుగు రోజులైనా కూలీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ రాబట్టింది. నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే రూ. 400 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది. బుక్ మై షో బుకింగ్స్ పరంగాను 4.79 మిలియన్స్ టికెట్స్ బుక్ అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఫోర్ డేస్ కు గాను రూ. 135 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే రూ. 600 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఈ లెక్కన రూ. 310 కోట్ల (షేర్) వసూళ్లు చేయాల్సి ఉంది. ఇప్పటికి రూ. 400 గ్రాస్ అంటే ఇంకా రెండు వందల కోట్లు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అని ట్రేడ్ లో చర్చ జరుగుతోంది.