Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీకి భారీ క్రేజ్ వస్తోంది. ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మూవీ టికెట్ల విషయంలో నానా రచ్చ జరుగుతోంది. చాలా చోట్ల టికెట్లన్నీ యాప్స్ లలో బ్లాక్ చేసేశారు. దీంతో థియేటర్లలో బ్లాక్ లో వేలకు వేలు పెంచేసి అమ్ముతున్నారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్లలో మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది.
Read Also : Tollywood Hero : ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసా..?
రజినీకాంత్ వీరాభిమాని ప్రభాకర్ తమిళ మీడియాతో మాట్లాడుతూ.. టికెట్స్ రూ.600, రూ.1,000ల నుంచి రూ.4,500 దాకా అమ్ముతున్నారని.. తనలాంటి అభిమానులు సినిమాకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నాడు. మొదటి రోజు చూడాలంటే భారీగా రేట్లు పెంచారంటూ తెలిపాడు. దాదాపు చెన్నైలోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందన్నాడు. దీంతో మూవీకి ఈ స్థాయి రేట్లు పెంచేసి అమ్మడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also : Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్
