Site icon NTV Telugu

Mollywood : కాంట్రవర్సీ.. కేరాఫ్ ‘కేరళ సినిమా’ ఇండస్ట్రీ

Mollywood

Mollywood

కాంట్రవర్సీస్ లేకుండా టైమ్ పాస్ కావడం లేదు మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. లాస్ట్ ఇయర్ జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో  ఇండస్ట్రీకి తెలుసు. కౌస్టింగ్ కౌచ్, లైగింక వేధింపులు, వివక్ష ఉన్నాయని వెల్లడి కావడంతో పాటు పలువురు యాక్టర్లు, ఫిల్మ్ మేకర్ల అరెస్టులు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవికి మోహన్ లాల్‌తో సహా మరికొందరి రాజీనామాలు చకా చకా జరిగిపోయాయి. దాంతో ఆ ఇష్యూ కాస్త  సద్దుమణిగింది. ఇక కేరళ బెస్ట్ సినిమాలతో మెరుపులు మెరిపిస్తుంది అనుకుంటే మళ్లీ కాంట్రవర్సీలో చిక్కేలా చేశారు యాక్టర్లు.

Also Read : Tollywood : మే 9పై కర్చీఫ్ వేసేసిన శ్రీవిష్ణు, సమంత.. హరిహర వీరమల్లు డౌటే.?

సినిమాలతో కన్నా ఎప్పుడూ ఏదో ఓ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌లో రోస్టింగ్‌కు గురౌతుంటారు షైన్ టామ్ చాకో. గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బయటపడ్డ ఈ దసరా విలన్ మళ్లీ ఇప్పుడు చిక్కాడు. కొచ్చిలో ఓ హోటల్‌పై నార్కోటిక్ అధికారులు రైడ్ చేయగా అక్కడ నుండి తప్పించుకున్నాడు. ఈ ఇష్యూలో ఎంటర్ అవ్వగానే తనను డ్రగ్స్ తీసుకుని వేధించాడంటూ బాంబు పేల్చింది ఓ కో యాక్ట్రెస్. కేస్ విత్ డ్రా కూడా చేసుకుంది కానీ ప్రజెంట్ ఇది నేషనల్ ఇష్యూగా మారిపోయింది.  షైన్ టామ్ చాకోపై డ్రగ్స్, సెక్యువల్ హెర్రాస్ మెంట్ అలిగేషన్స్ వచ్చాయో లేదో మంజుమ్మల్ బాయ్స్ యాక్టర్ శ్రీనాథ్ బాసిపై ఆరోపణలు చేశాడు నిర్మాత హసీబ్ మలబార్. శ్రీనాథ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, సీయు ఇన్ కోర్ట్ మూవీ షూటింగ్ సమయంలో తననే డ్రగ్స్ డిమాండ్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. దీని వల్ల షూటింగ్, డబ్బింగ్ డిలే అయ్యిందంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత. ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలు మల్లూవుడ్‌లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు యాక్టర్లు.. అందులోనూ రేసింగ్ అవుతున్న టైంలో ఇలాంటి ఆరోపణలతో.. మొత్తం కేరళ ఇండస్ట్రీ గురించి చర్చించేలా చేస్తోంది. మరీ ఈ డ్రగ్స్ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో..? ఎందరి పేర్లు బయటకు వస్తాయో.

Exit mobile version