నిన్న విజయ్ సేతుపతి, నేడు సూర్య టార్గెట్… ఎందుకు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాపై కొందరు బెదిరింపు రాజకీయాలు చేయాలనీ చూస్తున్నారా ? అంటే… కోలీవుడ్ లో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, నటులను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, దాడులు చేస్తామంటూ బెదిరించడం ఆందోళనకరంగా మారింది. సినిమాను సినిమాలాగే చూడకుండా ఇందులో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని అంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం దారుణం.
నిన్న విజయ్ సేతుపతి, నేడు సూర్య
నిన్న విజయ్ సేతుపతిని, నేడు సూర్యను టార్గెట్ చేశారు. ఇటీవల విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ వ్యక్తి విమానాశ్రయంలో వెళ్తున్న విజయ్ సేతుపతి మేనేజర్ ను తన్నాడు. అయితే ఆ వ్యక్తి విజయ్ సేతుపతినే టార్గెట్ చేశాడని వార్తలు రాగా, సేతుపతి స్పందిస్తూ చిన్న వివాదమని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి, ఎన్నిసార్లు తంతే అన్ని వెయ్యి రూపాయలు ఇస్తానని హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించాడని ఆరోపించిన అర్జున్ సంపత్ ఓ ప్రముఖ నటుడిని తన్నమని ఆయన బహిరంగంగా ప్రేరేపించడం గమనార్హం.
Also Read
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
Read Also : సూర్యకు బెదిరింపులు… దాడి చేస్తే లక్ష రివార్డు
ఇప్పుడు స్టార్ హీరో సూర్య వంతు వచ్చింది. కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తున్న ‘జై భీమ్’ నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని బృందం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించింది. కుల అల్లర్లను రెచ్చగొట్టి వన్నీ వర్గాలను అవమానించిన నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే అతనిపై దాడి చేయాలని, దాడికి పాల్పడిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని పన్నీర్ సెల్వం బహిరంగంగానే చెప్పడం గమనార్హం.
ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
తాజా పరిణామాలన్నీ చూస్తున్న ప్రజలు ఇలా ప్రముఖ తమిళ నటులను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో తమకు సంబంధించింది ఏదో కన్పించింది అని, తమ వర్గాన్ని కించపరిచారని, సినిమాని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేయడం, ఆ సినిమాకు సంబంధించిన నటులను కొట్టాలని ప్రేరేపించడం ఎంత వరకు సబబు ? హీరోలపై దాడి చేయమని చెప్పి యువతను ఎలాంటి దారిలో నడిపిద్దాం అనుకుంటున్నారు ? అని ఆయా హీరోల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా ? అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా సినిమాల విషయంలో రాజకీయాలు వేలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా ప్రముఖ నటులను కొట్టమంటూ ప్రోత్సహించడం నేరమనే చెప్పాలి.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..