సూర్యకు బెదిరింపులు… దాడి చేస్తే లక్ష రివార్డు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. సూర్యకు సపోర్ట్ గా #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. సూర్య హీరోగా, జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన “జై భీమ్” సినిమా అక్టోబర్ 2న విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోయింది.

ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ సన్నివేశాన్ని మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దుమణగలేదు సరికదా ఇప్పుడు ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తున్న ‘జై భీమ్’ నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని బృందం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించింది. కుల అల్లర్లను రెచ్చగొట్టి వన్నీ వన్నియార్ కమ్యూనిటీని అవమానించిన నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే అతనిపై దాడి చేసిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో నిన్న మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. దీంతో అక్కడి థియేటర్లలో సినిమాను ప్రదర్శించడం నిలిపివేశారు. ఇక సూర్య అక్కడికి వస్తే గనక దాడి చేస్తామని హెచ్చరించారు.

Read Also : ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో… గెలిస్తే మాత్రమే చరిత్రలో… : “గని” టీజర్

ఈ బెదిరింపుల మధ్య సూర్యకు మద్దతుగా ఇంటర్నెట్‌లో పలువురు ట్వీట్లు చేస్తున్నారు. #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం సూర్యకు సపోర్ట్ గా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. సూర్య అభిమానులే కాదు, పలువురు సినీ అభిమానులు కూడా కలిసి ట్వీట్లు చేస్తున్నారు. సూర్యపై దాడి చేస్తామని బామగా జిల్లా యంత్రాంగం చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా పలువురు ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా సూర్యకు అండగా నిలవాలని యాక్టర్స్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, సినిమా టెక్నీషియన్స్ గిల్డ్ వంటి సంస్థలు కోరుతున్నాయి.

Related Articles

Latest Articles