మహాత్మా గాంధీపై నటుగు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ లో నటుడు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు.
Also Read : Aryan Khan : 27 ఏళ్లకే..షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ చూసి షాక్ అవ్వాల్సిందే!
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ వ్యాఖ్యలతో సమాజంలో విభజనలు, ఘర్షణలు రావొచ్చని హెచ్చరించారు. “పెద్ద హీరోలు కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే, మేము కఠిన చర్యలు తీసుకునేలా చెస్తామని పేర్కొన్నారు. మరోవైపు, మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందిస్తూ.. “మాకు డిసిప్లినరీ కమిటీ ఉంది.. ఈ విషయాన్ని చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం.. త్వరలో మీటింగ్ పెట్టి అవసరమైన చర్యలు చేపడతాం అన్నారు.
