కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై భీమ్’. మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా విశేష ఆదరణను దక్కించుకుంటోంది. ప్రేక్షకులు, విమర్శకులతో పాటు తమిళనాడు సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐఎండిబిలో ఈ చిత్రం అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. హాలీవుడ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి ఈ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి చిత్రం ‘జై భీమ్’. ఒకవైపు సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రశంసలు ఏమాత్రం తగ్గడం లేదు.
Read Also : భారీ ధరకు అమ్ముడైన “పుష్ప” శాటిలైట్ రైట్స్
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క సినిమాపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తూ చిత్ర బృందానికి ముందస్తుగా తన అభినందనలు తెలియజేశారు సీతక్క. అయితే సీతక్క చేసిన ట్వీట్‌కు స్పందించిన హీరో సూర్య తమ చిత్ర బృందం తరఫున సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన వర్గాల కోసం జరిగిన ఈ న్యాయ పోరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.
