Site icon NTV Telugu

Conductor Jhansi: చైతన్య ఆత్మహత్యకు వాళ్ళే కారణం.. సంచలన నిజాలు చెప్పిన కండక్టర్ ఝాన్సీ

Jhansi

Jhansi

Conductor Jhansi: కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అప్పుల భాధ తట్టుకోలేక చైతన్య నిన్న నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో కుటుంబంతో పాటు ఢీ లో తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ఇక నేడు చైతన్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైతన్య మృతదేహాన్ని చూడడానికి వచ్చిన కండక్టర్ ఝాన్సీ.. చైతన్య ఆత్మహత్యకు సంబంధించిన సంచలన నిజాలు బయటపెట్టింది. “చైతన్య అన్నయ్య ఇంత పని చేస్తాడు అనుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ కళాకారులే. ఇంకొంచెం టైమ్ చెప్పి ఇస్తాను అంటే వారు కూడా ఆగేవారు. వీడియోలో అన్న చెప్పిన వారందరికీ డబ్బులు ఇవ్వాలి. ఒక కళాకారుడు బాధ ఇంకో కళాకారుడు అర్ధం చేసుకోడా..? అసలు అన్నయ్య ఇంత అప్పు చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ తాలూకా డబ్బులు ఆ ఆర్గనైజర్ వాళ్లు ఎగ్గొట్టారు. ఒక ఈవెంట్ కు ఆర్టిస్టులను తీసుకొస్తానని అన్నయ్య ఒప్పుకున్నాడు. కానీ, ఆ ఈవెంట్ చివరిలో ఆర్టిస్టులు సగం మంది హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆర్గనైజర్స్ దాదాపు 6 లక్షలు ఎగొట్టారు.

Virat Kohli: అది అసలైన భర్త అంటే.. భార్య బికినీ ఫోటో షేర్ చేసి

ఇక వచ్చిన ఆర్టిస్టులకు అయినా డబ్బులు ఇవ్వాలని అన్న అప్పు చేశాడు.. ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు.. అలా చేశాడు. నేను గతవారమే అన్నతో మాట్లాడాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు. కానీ, ఇలా డబ్బుల విషయం మాత్రం చెప్పలేదు. ఇంతలోనే ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. ఈ సందర్భంగా ఆర్గనైజర్లకు నేను చెప్పేది ఒకటే.. దయచేసి.. మా పొట్ట కొట్టకండి.. మీరు సరైన సమయంలో పేమెంట్ చేసి ఉంటే అన్న ప్రాణాలు తీసుకునేవాడు కాదు” అంటూ కంటనీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version