NTV Telugu Site icon

Durex: ఆలియా-రణ్‌బీర్ జంటకు కండోమ్ కంపెనీ గ్రీటింగ్స్

Alia Bhatt Durex Greetings

Alia Bhatt Durex Greetings

ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు తెలియచేసింది. సోమవారం ఆలియా భట్ తను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ ‘మెహ్ ఫిల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీ థీ… (మీ మోహం మధ్యలో మేము అడ్డుగా లేము) ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణ్ బీర్’ అని పోస్ట్ చేసింది.

Read Also: Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్‌పై చైతూ మాట్లాడతాడా?

దీనికి ప్రతిగా నెటిజెన్స్ ‘మీరు అడ్వైజ్ చేశారు. వారు వినలేదు. మీ ఫాల్ట్ కాదు బడ్డీ’ అని ఒకరు.. గ్రేట్ బాండింగ్ అని మరొకరు.. ఉఫ్ వాట్ ఎ మార్కెటింగ్ టాప్ నాచ్ అని ఇంకొకరు.. ‘జిత్నా భి ట్రై కరో బన్నీ డ్యూరెక్స్, లైఫ్ మే కుచ్ నా కుచ్ తో ఛూటేగా హై’ అని ఇంకో నెటిజెన్, ‘దట్స్ వాట్ వు నీడ్ సమ్ కామసూత్ర అండ్ సమ్ డ్యూరెక్స్ ఇన్ లైఫ్’ అంటూ మరొకరు కామెంట్లతో ముంచెత్తారు. మొత్తం మీద డ్యూరెక్స్ కండోమ్ సంస్థ తెలివైన మార్కెటింగ్‌తో నెటిజన్‌లను ఆకట్టుకుందనే చెప్పాలి. నిజానికి అమూల్ ఇటువంటి చమత్కారమైన ప్రకటనలకు ప్రసిద్ధి. ఇప్పుడ డ్యూరెక్స్ కూడా ఆ లిస్ట్ లో చేరిందన్నమాట.