Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, వ్యాఖ్యలు కానీ ఉంటే.. వాటివలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కేసు పెడతారు. ప్రస్తుతం ఇది ఒక టట్రెండ్ గా నడుస్తోంది. అయితే తాజాగా ఒక వ్యక్తి.. సినిమాలో హీరో సిగరెట్ కాల్చడంటూ అతడిపై పోలీస్ కేసు పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటి అంటే.. ఇళయ దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లియో. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని నా రెడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ మ్యూజిక్, విజయ్ మాస్ స్టెప్స్ తో సాంగ్ మొత్తం అదిరిపోయింది. దాదాపు వందకు పైగా డ్యాన్సర్లు ఈ సాంగ్ లో పాల్గొన్నారు.
Prabhas: ఇది ‘ఆదిపురుష్’ అసలు లెక్క!
ఇక సాంగ్ మొత్తంలో విజయ్ నోట్లో సిగరెట్ తోనే కనిపించాడు. అదే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టెలా చేసింది. ఈ మధ్యనే విజయ్.. తమిళనాడులో 10th, 12th పాస్ అయిన విద్యార్థులను కలిసి నగదు బహుమతులు అందించాడు. చదువు చాలా ముఖ్యమని, బాగా చదువుకోవాలని తెలిపాడు. ఇక అంతలా ఒక స్టార్ హీరో చెప్పడంతో ఆయనను విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకున్నారు. కానీ, అదే హీరో.. సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపిస్తే.. ఆదర్శంగా తీసుకున్న పిల్లలు అతడిని ఏం అనుకుంటారు అని సామాజిక కార్యకర్త ఆర్టీ సెల్వం కోర్టును ఆశ్రయించాడు. వెంటనే ఆ సాంగ్ మొత్తాన్ని తొలగించాలని అతను డిమాండ్ చేశాడు. నార్కోటిక్ యాక్ట్ కింద చిత్రబృందంపై చర్యలు తీసుకోవాలన కోరాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే విజయ్ అభిమానులు మాత్రం.. నటుడు అనేవాడు ఎవరైనా.. సిగరెట్, మందు తాగినా అది కేవలం సినిమా వరకు మాత్రమే అని, సినిమాను సినిమాలా చూడాలని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదంపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.