Naveen Mullangi: బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు పాతికేళ్ళ ఖమ్మం కుర్రాడు నవీన్ ముల్లంగి. 17 సంవత్సరాల వయసు నుండే వాటర్ ఎంటర్ టైన్మెంట్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు నవీన్. అయితే అతని మనసు ఇప్పుడు సినిమా రూపకల్పన వైపు మళ్ళింది. దాంతో తానే హీరోగా, రచయితగా, దర్శక నిర్మాతగా ‘కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్’ అనే మూవీని తెరకెక్కించాడు. విశేషం ఏమంటే… ఇది తెలుగులో కాదు, ఆంగ్లంలో తీసిన సినిమా. శివ ప్రీతిక సుక్క హీరోయిన్ గా నటించిన ఈ ఫీచర్ ఫిల్మ్ నిడివి గంటన్నర మాత్రమే. పరస్పర విరుద్ధమైన భావాలు కలిగిన ఓ అమ్మాయి – ఓ అబ్బాయి మధ్య సాగే ప్రేమకధ ఇదని నవీన్ తెలిపాడు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. మరి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తాపత్రయ పడుతున్న నవీన్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.