Site icon NTV Telugu

Comedy Stock Exchange: యూనిక్ పర్సనాలిటీ థీమ్ అదిరింది!

Aha (2)

Aha (2)

AHA: ఆహాలో స్పెషల్ ప్రోగ్రామ్ ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ వారం వారం వింత పోకడలు పోతోంది. సుధీర్, దీపిక తమదైన శైలిలో యాంకరింగ్ చేసి మెప్పిస్తుంటే, కమెడియన్స్ నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. వాళ్ళకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ను ఇచ్చి దర్శకులు అనిల్ రావిపూడి చక్కని వినోదాన్ని అందించేలా చేస్తున్నారు. శుక్రవారం నుండి ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ 8వ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ అవుతోంది. కార్యక్రమం ప్రారంభంలో సుధీర్, దీపికా మాత్రమే కాదు అనిల్ రావిపూడి సైతం సూపర్ గా స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ఈ వారం యూనిక్ పర్సనాలిటీస్ మీద ఎంటర్ టైన్ మెంట్ అందించమని అనిల్ కోరాడు. ట్రైన్ లో హాయిగా పడుకునే ప్యాసింజర్స్ ను వెండర్స్ ఎలా విసిగిస్తారో ఒకరు చూపించగా, ఇళ్ళలో తండ్రి కొడుకుల మధ్య అరమరికలు లేకపోతే ఎలా ఉంటుందో మరొకరు చూపించారు. ఎగ్జామ్ హాల్లో ముందున్న ఫ్రెండ్ అన్నీ చూపిస్తాడని, స్లిప్స్ కూడా పెట్టుకోకుండా వచ్చే వాళ్ళ పరిస్థితి మరొకరు కళ్ళకు కట్టినట్టు అభినయించారు. సినిమా షూటింగ్ సమయంలో అరవ ప్రొడక్షన్ మేనేజర్స్ వ్యవహార శైలిని మరొకకరు చూపించారు. ఇలా విచిత్ర మనస్తత్వాలు కలిగిన మనుషులను కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రెజెంట్ చేశారు. ఇందులో అత్యధిక స్టాక్స్ రాజుకు దక్కాయి.

సెకండ్ రౌండ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కు రాజశేఖర్ వస్తే ఎలా ఉంటుందో అవినాశ్, సద్దాం చూపించారు. అర్జున్ రెడ్డి – ‘అరుంధతి’లోని పశుపతి పాత్రలను భాస్కర్, హరి చేయగా, కాలకేయ – కాంచన బ్యూటీపార్లర్ లో తారసపడితే ఎలా ఉంటుందనేది రాజు, జ్ఞానేశ్వర్ చూపించారు. ఈ సెకండ్ రౌండ్ లోనూ రాజు లీడ్ లో ఉండటం విశేషం. ఇక థర్డ్ రౌండ్ లో ఇవాళ్టి రోజుల్లో సినిమాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయో అందరూ కలిసి పెర్ఫార్మ్ చేశారు. యాంకర్, చీఫ్ గెస్ట్, హీరోహీరోయిన్ తో పాటు హీరోతో సెల్ఫీ దిగాలనుకునే వీరాభిమాని, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, స్థానిక ఎమ్మెల్యే… ఇలా అందరినీ కవర్ చేస్తూ సాగిన ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇందులో కూడా రాజు పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలవడంతో లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది వీక్ గా అతనే నిలిచాడు. రెగ్యులర్ కామెడీ షోస్ కు భిన్నంగా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ సాగుతుండటం విశేషం. అనారోగ్య కారణంగా వేణు ఈ వారం ఎపిసోడ్ లో పాల్గొనలేదు. అయితే… గత ఎపిసోడ్స్ తో పోల్చితే… ఈవారం డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ కాస్తంత ఎక్కువ ఉన్నట్టు కనిపించాయి.

Exit mobile version