Comedian Venkatesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఎఫైర్స్ వలన ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చు రేగుతోంది. తాజాగా ఒక స్టార్ కమెడియన్ భార్య కూడా అలాగే మారింది. భర్త మరొకరితో ఎఫైర్ నడుపుతున్నాడు అని తెలుసుకొని సుపారీ ఇచ్చి మరీ అతడి కాళ్లు విరగొట్టించింది అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో బుల్లితెర కామెడీ షోలతో వెంకటేశ్ చాలా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా అతడు కమెడియన్ గా పనిచేస్తున్నాడు. ఇక కొన్నిరోజుల క్రితం అతడిపై ఒక దాడి జరిగింది. ఒక ఈవెంట్ కు వెళ్లి వస్తుండగా.. అతడి కారుపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వెంకటేశ్ కాళ్లు విరగొట్టి పారిపోయారు. దీంతో ఆ దాడి ఎవరు చేయించారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Mega Princess: మెగా ప్రిన్సెస్ జాతకం చెప్పిన వేణుస్వామి.. మెగా కుటుంబంలో వారు ఉండరట
ఇక ఈ దాడిపై వెంకటేశ్ ఒకలా చెప్తుంటే.. ఆమె భార్య సన్నిహితులు మరొక రకంగా చెప్పుకొస్తున్నారు. వెంకటేశ్ ఏమంటున్నాడంటే.. తన భార్య భానుమతికి తన కారు డ్రైవర్ తో ఎఫైర్ ఉందని, అది తనకు తెలియడంతోనే ఆమె .. ఈ దాడి చేయించిందని చెప్పుకొస్తున్నాడు. అయితే భానుమతి సన్నహితులు మాత్రం.. వెంకటేశ్ కే వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి.. భానుమతికి విడాకుల నోటీసులు పంపించాడు అని తెలుపుతున్నారు. ఇక భర్తను వదలలేని భానుమతి.. విడాకులు ఇవ్వలేక.. భర్తను తనవద్దే ఉంచుకొనేలా.. సుపారీ ఇచ్చి.. అతడి కాళ్లు విరగొట్టించి ఇంట్లోనే పెట్టుకుంది అని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.