Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?

Jabardasth Mahesh

Jabardasth Mahesh

Jabardasth Mahesh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెండితెరపై ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు మహేష్. రీసెంట్‌గా ‘సింగ్ గీతం’ సినిమాలోనూ నటించి అలరించిన ఈ కమెడియన్.. సడన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాను స్వయంగా నిజం చెప్పే వరకు తన గురించి ఎలాంటి వార్తలు రాయవద్దంటూ ఆయన నెటిజన్లను, మీడియాను కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆ వీడియోలో మహేష్ ఏమన్నాడంటే.. “లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ (ఊహించనిది). ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికీ తెలీదు. మనం బయట చూసే దాన్ని బట్టి ఏవేవో ఊహించుకుని బ్లైండ్‌గా నమ్మేయడం అస్సలు కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను స్వయంగా వచ్చి అసలు నిజం చెప్పేవరకు మీరు అనుకున్నది ఏదీ రాయొద్దు, పోస్ట్ చేయొద్దు. త్వరలోనే పూర్తి వివరాలతో నేనే మీ ముందుకు వచ్చి అసలు నిజం చెబుతాను” అంటూ మహేష్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో అసలు ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమైనా జరిగిందా? అనే చర్చ స్టార్ట్ అయ్యింది.

అయితే దీని వెనుక మరో కోణం కూడా ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా సోషల్ మీడియా అకౌంట్ల ప్రమోషన్ కోసం.. ఏదో జరిగిపోతోంది, త్వరలో నిజం చెబుతాం అంటూ హైప్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయిందని అంటున్నారు. తీరా కట్ చేస్తే అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలుతోంది. మరి మహేష్ పెట్టిన వీడియో కూడా అలాంటి ఒక క్రేజీ మూవీ ప్రమోషనా? లేక నిజంగానే ఆయన లైఫ్‌లో ఏదైనా ట్విస్ట్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.