Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇవి కాకుండా బుల్లితెరపై అలీతో సరదాగా అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 300 కి పైగా ఎపిసోడ్లు, ఎంతోమంది తారలు తమ మనోగతాలను ఈ టాక్ షో లో పంచుకునేవారు. ప్రతి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే అభిమానులకు ఆలీ చేదువార్త చెప్పుకొచ్చాడు. అలీతో సరదాగా సీజన్ ముగిస్తున్నట్లు తెలిపాడు. ఇక చివరి ఎపిసోడ్ గా తనను ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ సుమ ప్రత్యక్షమయింది. ఇన్నిరోజులు, ఇన్ని ఎపిసోడ్స్.. వారితో బంధాలు.. అనుబంధాలు.. అన్నింటికి మించి ఆలీ మనోగతాన్ని సుమ ఆవిష్కరించింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం గా సాగినట్లు కనిపిస్తోంది.
ఆలీ కెరీర్ ప్రారంభం ముంచి ఇప్పటివరకు ఆయన పడిన కష్టాలు, అవమానాలు అన్ని చెప్పుకొచ్చాడు. తన మొదటి సంపాదన రెండు రూపాయలు అని, అమ్మకు మొత్తం సంపాదన ఇచ్చి అందులో కొద్దిగా తీసుకొనేవాడినని చెప్పుకొచ్చాడు. తన చిన్నప్పుడే చెల్లిని పోగొట్టుకున్నాను అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక పవన్ తో గ్యాప్ ఎందుకు వచ్చింది అని సుమ అడిగిన ప్రశ్నకు ఆలీ మాట్లాడుతూ..” మా ఇద్దరి మధ్య గ్యాప్ లేదు.. గ్యాప్ క్రియేట్ చేశారు.. ఒకటి ఏం జరిగింది అంటూ కట్ చేసిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి వీరిద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేసినవారు ఎవరు అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
