Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం ఆలీ ఒకపక్క నటుడిగా మరోపక్క రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఆలీ తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోను పూర్తి చేశాడు. చివరి ఎపిసోడ్ లో సుమను హోస్ట్ గా పెట్టి ఆలీ తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. ఈ ఎపిసోడ్ లో ఆలీ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు. “నేను 17 ఏళ్ల వయస్సులో మా పక్కింటి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను.. ఆమె ఒకరోజు వర్షంలో తడుస్తూ వెళ్తుంటే చూసి.. మా చెల్లితో తనకు ఒక మంచి గొడుగు కొని ఇవ్వమని చెప్పాను. తరువాతి రోజు వర్షం లేకున్నా ఆమె గొడుగు వేసుకొని వెళ్తూ కనిపించింది. ఇక నాకు 21 ఏళ్లు వచ్చాకా మా అమ్మకు ఆమె గురించి చెప్పాను.. పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని.. అమ్మ కూడా ఒప్పుకొంది.
అయితే నేను షూటింగ్ కు వెళ్లి వచ్చేలోపు మా అమ్మ.. ఆమెను ఒక థియేటర్ లో చూసిందట. ఫ్రెండ్స్ తో బయటికి వచ్చాను అని ఆమె చెప్పడంతో సరే అని ఇంటికి వచ్చిన మా అమ్మ నేను వచ్చాకా అదే విషయాన్నీ చెప్పి ఆ అమ్మాయి వద్దు అని చెప్పింది. నేను కూడా అమ్మ మాట జవదాటకుండా నా షూటింగ్స్ లో నేను బిజీ అయ్యాను. ఆ తరువాత రోజా సినిమాలో లా.. నా భార్య జుబేదా అక్క ను చూడడానికి వెళ్లి చెల్లిని చేసుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఆలీ ప్రేమాయణం నెట్టింట వైరల్ గా మారింది.. అమ్మా ఆలీ మామూలోడు కాదే .. పక్కింటి పాపతో ప్రేమాయణం బాగానే నడిపాడే అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.