NTV Telugu Site icon

Mad: ఏం సాంగ్ రా బాబు.. కాలేజ్ రోజులను కళ్ళముందుకు తీసుకొచ్చేసింది

Mad

Mad

Mad: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర హారిక మైరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రంగాఉంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్ ఉదయం ఎన్టీఆర్ చేతుల మీదగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ పాప అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో మర్చిపోలేని రోజులు అంటే కాలేజ్ రోజులే. ఆ సమయంలో చేసే అల్లరి, అమ్మాయిలు, గొడవలు ఇలా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉంటాయి. మ్యాడ్ .. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తుందని చెప్పొచ్చు.

TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్‌.. నిర్వహణకు సర్వం సిద్ధం

ఇక ప్రతి కాలేజ్ ఫెస్ట్ లో అమ్మాయిలు అబ్బాయిలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడు కాలేజ్ కు రానివాడు కూడా ఆరోజు కాలేజ్ కు వస్తాడు. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట చేరి ఆటలు, పాటలు, డ్యాన్స్లు.. అబ్బో అసలు చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ లో కూడా అదే చూపించారు. అమ్మాయిలు అందాలను ఎరవేసి.. అబ్బాయిలను ఓ ఆట ఆడిస్తారని, ప్రేమించమంటే పోజ్ కొడతారని అబ్బాయిలు చెప్తే.. అమ్మాయిలు ఒప్పుకోవడం జరగదని, అబ్బాయిలు ప్రేమించాక ఎలా ఉంటారో తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇక కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్.. ప్రతి స్టూడెంట్ మనోభావాలు అని చెప్పుకోవచ్చు. ఇక భీమ్స్ సంగీతం వేరే లెవెల్. మొత్తానికి సాంగ్స్ తో మ్యాడ్.. అభిమానులను మ్యాడ్ అయ్యేలా చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

College Papa Full Video Song | MAD | Kalyan Shankar | S. Naga Vamsi | Bheems Ceciroleo