Site icon NTV Telugu

Liger: కాక రేపుతున్న ‘కోకా 2.0’ డాన్స్ నంబర్!

Liger

Liger

 

విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ‘లైగర్’ నుండి ముచ్చటగా మూడో పాట వచ్చేసింది. ఈ పాన్ ఇండియా మూవీలోని పెప్పీ నంబర్ ‘అక్డి పక్డి’ హ్యాంగోవర్‌ నుండి కుర్రకారు బయటకు రాకముందే… ఇప్పుడు డాన్స్ నంబర్ సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం మొదలెట్టింది. డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో విడుదలైన ‘కోకా 2.0’ పాట ఆ సెలబ్రేషన్స్ ని మరింత పెంచింది. లిజో జార్జ్ – డిజె చేతస్ మరొక డ్యాన్స్ నంబర్‌తో ముందుకు వచ్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఎలిగెంట్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే డ్రెస్సింగ్, వైబ్రెంట్ సెట్, కొరియోగ్రఫీ… ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా వుంది. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడడంలో రామ్ మిరియాల తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ, అనన్య పాండే అదిరిపోయే డ్యాన్సులు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ భాంగ్రా స్టెప్పులు మెస్మరైజ్ చేశాయి. ఈ పాటలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘కోకా 2.0’ డాన్స్ నంబర్ వేడుకల్లో మారుమ్రోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, లైగర్ యూనిట్ దేశంలోని వివిధ నగరాల్లో ప్రమోషనల్ టూర్‌లో ఉన్నారు. ప్రతి ఈవెంట్‌కు భారీ సంఖ్యలో జనం హాజరౌతున్నారు. ఈ నెల 14న వరంగల్‌ హనమకొండలోని సుబేదారి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ‘లైగర్’ భారీ ఫ్యాండమ్ టూర్ నిర్వహించనున్నారు. మొత్తం చిత్ర యూనిట్ పాల్గొనే ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Exit mobile version