Site icon NTV Telugu

Tollywood:సీఎం జగన్ తో చిరు భేటీ.. ప్రభాస్, మహేష్, తారక్ కూడా..?

tollywood

tollywood

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సినీ పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ ఉండనుందని సీఎంఓ కాఘరారు చేశారు.

ఇక ఈ భేటీలో చిరుతో టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, తారక్, నాగార్జున కూడా భేటీ కానున్నారట. ఇప్పటికే సినీ పరిశ్రమ అంశాల పై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించినట్లు తెలుస్తోంది. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికపై వీరందరూ మరోసారి జగన్ తో ముచ్చటించనున్నారట. రేపటితో ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని టాలీవుడ్ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. మరి రేపు భేటీలో ఏం జరగుందో చూడాలి.

Exit mobile version