Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇక మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్, భూమా అఖిల ప్రియ సోదరి మౌనికను ప్రేమించడం, అది ఇష్టం లేని మోహన్ బాబు కుటుంబం పెళ్ళికి నిరాకరించడం.. దీంతో మనోజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. గత కొన్నిరోజుల నుంచి మాత్రం మనోజ్, మంచు కుటుంబం చేసుకొనే ఏ ఫంక్షన్ లో కానీ, ఈవెంట్ లో కానీ కనిపించలేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వీరి మధ్య విబేధాలు ఉన్నాయి అన్నది నిజమేనని, అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
విషయం ఏంటంటే.. నిన్న మంచు విష్ణు బర్త్ డే. అన్నకు బర్త్ డే విషెస్ ను మనోజ్ కొంచెం ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మహిళ జంబలకిడి జారు మిఠాయ అంటూ సాంగ్ పాడిన విషయం విదితమే. ఆ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాని మీద ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. చివరకు మనోజ్ సైతం ఆమెను కలిసి ఆమెతో అదే పాటను పాడించి విష్ణుకు బర్త్ డే విషెస్ చెప్పాడు. అన్న విష్ణు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా పాజిటివ్ గా ఆలోచించాలని మరీ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ మంచు కుటుంబాన్ని మరోసారి ఆడేసుకుంటున్నారు. సొంత అన్ననే తమ్ముడు ట్రోల్ చేస్తున్నాడు.. మిగతా వారు చేయడంలో తప్పేముంది అంటూ చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరో విషయమేంటంటే.. ఈ వీడియోకు కానీ, తమ్ముడు కు కానీ విష్ణు స్పందించకపోవకడం.. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పిన విష్ణు, తమ్ముడు మనోజ్ ను మాత్రం పట్టించుకోకుండా వదిలేసాడని, ఇక్కడే వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకొస్తున్నారు.