Site icon NTV Telugu

Samantha: మరొకరితో సమంత బ్రేకప్.. ఎవరి అవసరం లేదంటూ ఒంటరి పోరాటం..?

Sam

Sam

Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ చుట్టూ రూమర్స్ పంచదార చుట్టూ చీమలు చేరినట్లు వస్తూనే ఉంటాయి. ఇక మిగతావన్నీ పక్కన పెడితే సమంత స్నేహానికి ఎక్కువ విలువనిస్తుందని, ఒక్కసారి ఆమెతో స్నేహం చేస్తే విడిపోవడం కష్టమని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సామ్ స్నేహితుల్లో మొదటి వరుసలో ఉంటుంది సింగర్ చిన్మయి. నిజం చెప్పాలంటే.. వీరిద్దరూ దేహం, ఆత్మ లాంటివారు. సామ్ దేహం అయితే.. చిన్మయి ఆత్మ లాంటిది. ఏ మాయ చేశావే దగ్గర నుంచి ఇటీవల ఓ బేబీ వరకు ఆమె వాయిస్ తోనే సామ్ సినిమాలు చేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే బయట కూడా ఈ స్నేహితుల మధ్య దాపరికాలు లేవని టాక్.. ఏ విషయంలోనైనా సామ్ కు సపోర్ట్ గా నిలుస్తోంది చిన్మయి.

ముఖ్యంగా సామ్ విడాకుల విషయంలో ఆమె సపోర్ట్ చాలానే ఉంది. అయితే కొద్దీరోజుల క్రితం సామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చిన్మయి పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య విబేధాలు ఏమున్నాయో తెలియదు కానీ సామ్ సైతం చిన్మయి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఒంటరి పోరాటం చేయడానికి రెడీ అయిపోయిందట.. అంటే తన సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో స్థిరపడింది.. అక్కినేని ఇంటి కోడలిగా మారింది.. తెలుగు బాగానే మాట్లాడుతోంది.. దీంతో ఒకరి అవసరం తనకు లేదని డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అంటూ చెప్పుకొస్తున్నదట. యశోద, శాకుంతలం సినిమాలో సామ్ ఒరిజినల్ వాయిస్ వైన్ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే సామ్ ఎందుకు ఇలా అందరితో విబేధాలు పెట్టుకొనివిడిపోతుంది ..ఒంటరిగా ఆమె ఉండాలనుకుంటుందా..? లేక అందరు ఆమెను ఒంటరిని చేస్తున్నారా..? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version