NTV Telugu Site icon

Samantha: మరోసారి విషమంగా సమంత ఆరోగ్యం.. చికిత్స కోసం అక్కడికి ?

Sam

Sam

Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె మూడవ స్టేజిలో ఉందని, హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుందని రూమర్స్ వస్తున్నాయి. యశోద సినిమా ప్రమోషన్స్ లో మొదటిసారి బయటకొచ్చిన సామ్ తన ఆరోగ్యం గురించి ఎంతో ఎమోషనల్ అయ్యింది. దీంతో సామ్ కొద్దికొద్దిగా కోలుకొంటుందని అభిమానులు సంతోషించారు.

కాగా, గత కొన్నిరోజుల నుంచి సామ్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోసారి సమంత ఆరోగ్యం విషమించిందని, ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుందని చెప్పుకొస్తున్నారు. దీంతో వారం కిందట సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని, సామ్ ఆరోగ్యంగా ఉందని తెలిపాడు. ఇక మరోసారి సామ్ ఆరోగ్యం గురించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె చికిత్స కోసం సౌత్ కొరియా వెళ్లనున్నదట. అక్కడే పదిరోజులు ఉండి.. చికిత్స పూర్తి అయిన తరువాత మళ్లీ ఇండియా రానుంది. అక్కడైనా సామ్ కు మంచి వైద్యం అంది ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Show comments