NTV Telugu Site icon

Sukumar : సుకుమార్ తో షారుఖ్ సినిమా..?

Sukumar

Sukumar

Sukumar : పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో సౌత్ డైరెక్టర్ల సత్తా ప్రపంచమంతా తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు మన డైరెక్టర్లకు నేషనల్ లెవల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. పుష్ప సిరీస్ తో సుకుమార్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఓ అతిపెద్ద వార్తను వైరల్ చేసేస్తోంది. బాద్షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. ఇప్పటికే మణిరత్నం, అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్లతో షారుఖ్ వర్క్ చేశాడు.

Read Also : Vijay Sethupathi : తెలుగు హీరోలు పట్టనిది.. సేతుపతి సింగిల్ సిట్టింగ్ లోనే పట్టేశాడు !

మరోసారి సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడని.. అది కూడా సుకుమార్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇది వినడానికే తప్ప ఆచరణ సాధ్యం కానిది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది పూర్తవడానికి ఎంత లేదన్నా రెండేళ్లు టైమ్ పడుతుంది. అంటే 2028 వరకు పూర్తి కావొచ్చేమో. దాని తర్వాత పుష్ప-3 ర్యాంపేజ్ ఉండబోతోంది.

మొన్న మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్ బల్లగుద్ది మరీ పుష్ప-3 త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పేశాడు. అంటే దానికి ఎంత లేదన్నా మూడేళ్ల టైమ్ పడుతుంది. మొత్తం మీద 2031 దాకా అంటే ఇంకో ఆరేళ్ల పాటు సుకుమార్ ఖాళీగా లేడు. ఆ తర్వాత అయినా షారుఖ్ తో తీస్తాడా.. షారుఖ్‌ అన్నేళ్లు ఆగుతాడా అంటే చెప్పలేం. పైగా సుకుమార్ మాత్ర తీస్తే మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడంట. రాజమౌళి లాగానే తెలుగు హీరోలతో సినిమాలు చేసి మార్కెట్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఏర్పాటు చేసుకోవాలన్నది లెక్కల మాస్టర్ ప్లాన్. కాబట్టి షారుఖ్ తో సినిమా ఉండటం ఊహ మాత్రమే.