Sukumar : సుకుమార్ తో షారుఖ్ సినిమా..?
- ప్రస్తుతం ఫుల్ బిజీగా లెక్కల మాస్టర్
- ఇప్పట్లో ఖాళీ లేదు
- మరి షారుఖ్ తో సినిమా ఉంటుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar : పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో సౌత్ డైరెక్టర్ల సత్తా ప్రపంచమంతా తెలిసిపోతోంది. మరీ ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు మన డైరెక్టర్లకు నేషనల్ లెవల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. పుష్ప సిరీస్ తో సుకుమార్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఓ అతిపెద్ద వార్తను వైరల్ చేసేస్తోంది. బాద్షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. ఇప్పటికే మణిరత్నం, అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్లతో షారుఖ్ వర్క్ చేశాడు.
Read Also : Vijay Sethupathi : తెలుగు హీరోలు పట్టనిది.. సేతుపతి సింగిల్ సిట్టింగ్ లోనే పట్టేశాడు !
Also Read
మరోసారి సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడని.. అది కూడా సుకుమార్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇది వినడానికే తప్ప ఆచరణ సాధ్యం కానిది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది పూర్తవడానికి ఎంత లేదన్నా రెండేళ్లు టైమ్ పడుతుంది. అంటే 2028 వరకు పూర్తి కావొచ్చేమో. దాని తర్వాత పుష్ప-3 ర్యాంపేజ్ ఉండబోతోంది.
మొన్న మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్ బల్లగుద్ది మరీ పుష్ప-3 త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పేశాడు. అంటే దానికి ఎంత లేదన్నా మూడేళ్ల టైమ్ పడుతుంది. మొత్తం మీద 2031 దాకా అంటే ఇంకో ఆరేళ్ల పాటు సుకుమార్ ఖాళీగా లేడు. ఆ తర్వాత అయినా షారుఖ్ తో తీస్తాడా.. షారుఖ్ అన్నేళ్లు ఆగుతాడా అంటే చెప్పలేం. పైగా సుకుమార్ మాత్ర తీస్తే మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడంట. రాజమౌళి లాగానే తెలుగు హీరోలతో సినిమాలు చేసి మార్కెట్ ఇంటర్నేషనల్ వైడ్ గా ఏర్పాటు చేసుకోవాలన్నది లెక్కల మాస్టర్ ప్లాన్. కాబట్టి షారుఖ్ తో సినిమా ఉండటం ఊహ మాత్రమే.
- Tags
- Pushpa
- Shah Rukh Khan
- sukumar
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!