Site icon NTV Telugu

Dacoit : డెకాయిట్ షూటింగ్ ఆగిపోయిందా.. క్లారిటీ ఇదే..

Decoit

Decoit

Dacoit : ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ మూవీ.. ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో తప్పుకుంది. చివరకు మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు.

Read Also : Who is India’s DGMO: కాల్పుల విరమణలో కీలకంగా వ్యవహరించిన DGMO ఎవరు?

ఆ నడుమ అడవిశేష్ బర్త్ డే సందర్భంగా మృణాల్ ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. అయినా సరే షూటింగ్ ఆగిపోయిందంటూ రకరకాల రూమర్లు వస్తున్నాయి. కానీ అవేమీ లేదని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. షూటింగ్ కంటిన్యూగా జరుగుతోందని.. త్వరలోనే అప్డేట్లు వస్తాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. మూవీ విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మొద్దంటూ తెలిపారు మూవీ మేకర్లు. అడవి శేష్ తో పాటు మృణాల్ కూడా వరుస హిట్లతో జోరు మీదున్నారు. ఈ జంట చేసే రొమాంటిక్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Sumanth : మృణాల్ ఠాకూర్ తో పెళ్లి రూమర్లు.. సుమంత్ క్లారిటీ..

Exit mobile version