Allu Arjun : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త. శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని. ఇప్పటికే అట్లీతో చేయబోయే సినిమా హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో కథతో వస్తుందని ప్రచారం ఉంది. సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, శక్తిమాన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ శక్తిమాన్ సినిమాలు గానీ, సీరియల్ గానీ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ బన్నీ ఈ పాత్ర చేస్తున్నాడని రకరకాల రూమర్లు చుట్టేశాయి. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ రీసెంట్ గానే బన్నీకి శక్తిమాన్ కథ చెప్పాడని.. అది అతిభారీ బడ్జెట్ తో ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వేసేస్తున్నారు.
Read Also : The Rajasaab : ది రాజాసాబ్ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
ఈ బాసిల్ జోసెఫ్ గతంలో ‘మిన్నల్ మురళి’ అనే లోకల్ సూపర్ హీరో మూవీ చేశాడు. ఇప్పుడు ఏకంగా సూపర్ హీరో మూవీ తీస్తున్నాడని అంటున్నారు. మరి నిజంగానే సూపర్ హీరో మూవీనా అంటే అస్సలు కాదు. అదంతా ఉత్తదే. గీతా ఆర్ట్స్ బ్యానర్ కోసం బాసిల్ జోసెఫ్ ఓ చిన్న కథ చెప్పాడు. అది చాలా చిన్న బడ్జెట్ తో తీసే మూవీ. అందులో బన్నీ హీరోనే కాదు. వేరే వాళ్లతో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదే బాసిల్ ను గతంలో సోనీ సంస్థ సూపర్ హీరో మూవీ శక్తిమాన్ కథ చేద్దాం అంటూ అడిగింది.
మనోళ్లకు రూమర్లు సృష్టించడం అంటే మహా ఇష్టం కదా. అందుకే ఆ సూపర్ హీరో కథనే ఇప్పుడు బన్నీకి చెప్పేశాడని రకరకాల కథనాలు వడ్డించేశారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం మనోళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకే ఈ రూమర్ ఒకటి పుట్టించేశారు. అసలు శక్తిమాన్ సినిమా తీయాలంటే ఎంత లేదన్నా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేయాలి. పైగా బాసిల్ కు అంత పెద్ద సినిమా తీసే అనుభవం లేదు. ఇప్పటి వరకు వంద కోట్ల బడ్జెట్ మూవీ కూడా ఆయన చేయలేదు.
పోనీ వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలంటే అది ఏ రాజమౌళి సినిమానో అయ్యుంటే ఎవరైనా నమ్మేస్తారు. కానీ పేరు కూడా సరిగ్గా తెలియని డైరెక్టర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెడుతారంటే నమ్మేయడమేనా. ప్రతి మూవీ గురించి అల్లు అర్జున్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. అలా రాలేదు అంటే అది లేనట్టే లెక్క. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలనుకున్న ఆగిపోయింది. ఎన్టీఆర్ తో మూవీని ప్లాన్ చేసుకుంటున్నాడు గురూజీ. అట్లీతో మూవీ తర్వాత బన్నీ ఎవరితో చేస్తాడన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కొన్ని కథలు అయితే వింటున్నాడని టాక్ నడుస్తోంది. ఎవరితో చేస్తాడో వెయిట్ అండ్ సీ.
Read Also : 8 Vasantalu Trailer : 8 వసంతాలు ట్రైలర్.. అమ్మాయి ప్రేమ లోతు..
