Site icon NTV Telugu

Sreenu Vaitla : సినిమా డబ్బులతో భూములు కొన్నా.. శ్రీనువైట్ల కామెంట్స్..

Sreenu-vaitla

Sreenu-vaitla

Sreenu Vaitla : టాలీవుడ్ లో శ్రీనువైట్లకు ఒకప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చేస్తున్న సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. చివరగా గోపీచంద్ తో విశ్వం మూవీ చేశాడు. అది కూడా అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా మరో మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీను వైట్లకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు శ్రీనువైట్ల.

Read Also : Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?

ఆయన మాట్లాడుతూ.. నాకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నది నిజం కాదు. నాకు అన్ని ఆస్తులు లేవు. నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ ను. సినిమాలతో నాకు సరిపోయేంత సంపాదించాను. నేను సంపాదించిన డబ్బులు మొత్తం భూములపైనే పెట్టాను. వాటి విలువ ఇప్పుడు బాగానే పెరిగింది. కాబట్టి నాకు ఎలాంటి టెన్షన్ లేదు.

నాకు సినిమాలు తీయడమే వచ్చు. ఇంకో పని రాదు. వేరే బిజినెస్ లు కూడా లేవు. భూములపై అవగాహన ఉంది కాబట్టే వాటిపై డబ్బులు పెట్టాను. ఇప్పటి వరకు నాకు అవి ఉన్నాయనే ధైర్యమే ఉంది. పేరుకే నేను పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ ను. కానీ వేల కోట్లు సంపాదించలేదు’ అంటూ తెలిపాడు శ్రీనువైట్ల.

Read Also : Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..

Exit mobile version