ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘సిటాడెల్’. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ వార్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రే మ్యాన్ లాంటి సినిమాలని రూపొందించిన రుస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకూ ప్రతి ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. మొదటి రోజు మాత్రం రెండు ఎపిసోడ్స్ ని ఒకేసారి ప్రీమియర్ చెయ్యనున్నారు ఆ తర్వాత మాత్రం ప్రతి వీక్ ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన ‘సిటాడెల్ స్పై ఏజెన్సీ; అమెరికన్ వర్షన్ లో ప్రియాంక నటిస్తుంటే ఇండియన్ అడాప్షన్ లో సమంతా నటిస్తోంది. సిటాడెల్ అనే యూనివర్స్ లో జరిగే ఈ వెబ్ సీరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ ‘సిటాడెల్’ గూఢచారి సంస్థ కోసం పని చేస్తూ ఉంటారు. వీరు ఏ దేశానికి, ఏ నాయకుడికి సమాధానం చెప్పారు. ఇండిపెండెంట్ గా వర్క్ చేసే సిటాడెల్ యూనివర్స్ లో ‘స్టాన్లీ టుక్సీ’ ప్రియాంక మరియు రిచర్డ్‌లకి టీం హెడ్ గా కనిపించాడు. ట్రైన్ ఎపిసోడ్ తో కూల్ గా ఓపెన్ అయిన ట్రైలర్ విత్ ఇన్ సెకండ్స్ యాక్షన్ మోడ్ లోకి మారింది. ఎక్కువ శాతం యాక్షన్ పార్ట్ ఉన్న ఈ ట్రైలర్ స్లిక్ అండ్ స్టైలిష్ గా ఉంది. ట్రైలర్ లో అక్కడక్కడా ప్రియాంక రొమాంటిక్ గా కూడా కనిపించింది. రుస్సో బ్రదర్స్ నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ అండ్ డ్రామా ‘సిటాడెల్’లో కావలసినంత ఉందని ట్రైలర్ తోనే చూపించారు మేకర్స్. ఈ ట్రైలర్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ అంతా ఇప్పుడు ఏప్రిల్ 28 కోసం వెయిట్ చెయ్యడం గ్యారెంటీ.
On April 28, enter a new age of espionage. Watch the trailer for Citadel, a new series on @PrimeVideo starring @_richardmadden and @priyankachopra. #CitadelOnPrime pic.twitter.com/RzgASApblJ
— Citadel (@CitadelonPrime) March 6, 2023