NTV Telugu Site icon

SSMB29: మహేష్ సరసన దీపికా.. విలన్ గా అమీర్ ఖాన్ ..?

Mahesh

Mahesh

SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి కాంబో అంటే రాజమౌళి మాత్రమే నిజం చేయగలడు. బాహుబలి లాంటి సినిమాలో హీరోగా ప్రభాస్ ను, విలన్ గా రానాను పెట్టినా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ ప్లాన్ చేసినా అది ఒక్క జక్కన్నకే సాధ్యం. ఇక ఈ రెండు అరుదైన కాంబోల తరువాత వస్తున్నదే SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ కాంబో గురించి ఎన్ని చర్చలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సమయంలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.

Pawankalyan ‘BRO’ : వామ్మో.. ఐటెం సాంగ్ కు ఊర్వశి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఇక తాజాగా SSMB29 నుంచి ఒక వార్త బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో మహేష్ సరసన దీపికా పదుకొనే నటిస్తుందని చెప్పుకొస్తున్నారు. అంతేకాదండోయ్.. మెయిన్ విలన్ గా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇది నిజం చేయడానికి జక్కన్నకు నిమిషం పట్టదు. ఆయన సినిమాలో చేయడానికి ఏ వుడ్ నటులైన.. కథ కూడా వినాల్సిన అవసరం లేదు అనేస్తారు. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే ఈ వార్త అభిమానులు మాత్రం అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బావుందో .. ఇదే నిజమైతే ఎంత బాగుండునో అని కలలు కంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.