NTV Telugu Site icon

Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?

Film Shooting In Theaters

Film Shooting In Theaters

Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్‌లో కనిపించకుండా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ చెల్లించేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు. ఇక ఈ లెక్కన వాట్సాప్, ఇన్స్టా స్టేటస్ లు పెట్టడం కోసం, సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఫోన్లలో రికార్డు చేస్తున్న వాళ్ళు కూడా ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇక ఈ కొత్త బిల్లులో సినిమాల అనధికారిక రికార్డింగ్‌ అంటే షూట్ చేయడం (సెక్షన్‌ 6ఏఏ), వాటి ప్రదర్శన అంటే ప్రోజెక్ట్ చేయడం లేదా ప్లే చేయడం (సెక్షన్‌ 6ఏబీ వంటి వాటిని నిషేధించేలా కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు.

Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?

అంతేకాక సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఇచ్చే సర్టిఫికేషన్‌ కాల పరిమితి ప్రస్తుతం 10 ఏళ్లుగా ఉండగా ఈ బిల్లుతో ఆ కాలపరిమితిని రద్దు చేయనున్నట్లు వెల్లడించారు అయితే ఇకపై ఈ సర్టిఫికేట్‌ వ్యాలిడిటీ లైఫ్ టైం ఉండనుంది. ఇక సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, ఏ, యుఏ, ఎస్‌ సర్టిఫికెట్లతోపాటు యూఏ సర్టిఫికెట్‌కు అదనంగా మరిన్ని మార్పులు ఈ బిల్లులో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ప్రస్తుతం యూఏ సర్టిఫికేట్‌తో తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఉండగా అందుకు మార్పులు చేస్తూ యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+.. ఇలా మూడు విభాగాలుగా విభజించనున్నారని తెలుస్తోంది. ఏ, ఎస్‌ సర్టిఫికేట్‌ ఉన్న సినిమాలను టీవీలు, ఓటీటీలలో అక్కడి టెలీకాస్ట్ రూల్స్ అనుగుణంగా ప్రదర్శించేందుకు వీలుగా సెన్సార్‌ బోర్డు ప్రత్యేక సర్టిఫికేట్‌ ఇచ్చేలా మరో సవరణ కూడా చేయడం గమనార్హం. ఈ సర్టిఫికేట్‌ కోసం సెన్సార్ బోర్డు కొన్ని సీన్లను మార్చడం లేదా తొలగించమని ఆదేశాలు జారీ చేసేందుకు అనుమతి ఉంటుందని చట్టంలో పొందుపరిచారు.