Site icon NTV Telugu

Jabilamma Neeku Antha Kopama: తెలుగు ప్రీమియర్ ఎప్పుడు ? ఎక్కడ ? చూడాలంటే !

Jabilamma

Jabilamma

జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్‌ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను ఈ ఆదివారం ప్రసారం చేయనుంది.

Athadu : ‘అతడు’ తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారు!

డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఆగస్టు 9 శనివారం రాత్రి 9 గంటలకు, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథులుగా హీరో తేజ సజ్జా, యాంకర్ ఉదయభాను, నటుడు సత్యరాజ్, మెగా డాటర్ కొణిదెల సుస్మిత వంటి సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆగస్టు 09న మొదటి భాగం, ఆగస్టు 16న రాత్రి 9 గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘నీలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం (NEEK)’ తెలుగు వెర్షన్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను జీ తెలుగు ప్రీమియర్‌గా అందిస్తోంది.

Exit mobile version