Site icon NTV Telugu

ఉప్పలపాటి ప్రభాస్ జగమంత కుటుంబం

Prabhas

మన స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఉంటుంది. సోషల్ మీడియా రచ్చ మొదలైన తర్వాత స్టార్‌ కూడా క్యాలండర్ కి తగినట్లు పలు సందర్భాలలో కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్యాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ ది అయితే జగమంత కుటుంబం. ఇటీవల డాటర్స్ డే సందర్భంగా పలువురు స్టార్ లు తమ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ వారితో కలసి ఉన్న ఫొటోలని షేర్ చేశారు.

Read Also : ‘మా’ ఎన్నికల నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్

అలా కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ లో ఉప్పలపాటి కుంటుంబానికి చెందిన పలువురు దర్శనం ఇచ్చారు. తన కూమార్తెలు.. మనవరాళ్లు.. మనవళ్లతో కృష్టంరాజు ఫ్యామిలీ కలర్ ఫుల్ గా దర్శనం ఇచ్చింది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. అందులో ఓ ఫోటోను చూసిన వారు ‘చక్రం’లో ప్రభాస్ మీద చిత్రీకరించిన ‘జగమంత కుటుంబం నాది..’ అనే పాటను గుర్తు చేసుకుంటున్నారు.

Exit mobile version