ఆది పినిశెట్టి : రంగస్థలంలో హీరోకి అన్నగా కనిపించి ఆకట్టుకున్న ఆది పినిశెట్టి డ్రైవ్ ట్రయిలర్ రిలీజ్‌తో మరోసారి అటెన్షన్‌లోకి వచ్చాడు. హీరో ఇమేజ్ కోసం ఎదురుచూడకుండా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌నే కెరీర్ ఆయుధంగా మార్చుకున్న ఆది వరుసగా ఆసక్తికర ప్రాజెక్ట్స్‌తో ముందుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన తమిళ హారర్ థ్రిల్లర్ శబ్ధంలో నటించి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు మరగత నానయం2 లో ఫాంటసీ కామెడీ జానర్‌లో కనిపించబోతున్నాడు. మరోవైపు అఖండ 2 తాండవంలో బాలకృష్ణకు అపోజిట్ గా విలన్‌గా చేశాడు. ప్రొటాగొనిస్ట్ అయినా, యాంటాగొనిస్ట్ అయినా పాత్ర బలంగా ఉంటే చాలు అన్న ఆది స్ట్రాటజీ ఇప్పుడు ఆయనకు వరస అవకాశాలను తెచ్చిపెడుతోంది.
కార్తికేయ : ఆర్ ఎక్స్ 100తో హీరోగా సక్సెస్ అందుకున్న కార్తికేయ, ప్రస్తుతం ఒకవైపు హీరోగా మరోవైపు పవర్‌ఫుల్ విలన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ సరైన బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ లో విలన్‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కార్తికేయ, అజిత్ సినిమా ‘వలిమై’లోనూ నెగటివ్ రోల్‌తో మెప్పించాడు. ఆ తర్వాత బెదురులంక 2012, భజే వాయువేగం లాంటి సినిమాల్లో హీరోగా తన రేంజ్ చూపించే ప్రయత్నం చేశాడు. పాత్ర ఏదైనా సరే పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్న కార్తికేయకి ఇప్పుడు కావాల్సింది మాస్ హిట్. హీరోగా అయినా, విలన్‌గా అయినా కెరీర్‌ను టర్న్ చేసే ఒక్క స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి.
సత్యదేవ్ : బాలీవుడ్‌లో టాలెంటెడ్ ఆర్టిస్టుల జాబితాలో ముందుండే పేరు సత్యదేవ్, చిన్న పాత్రతో పరిచయమై, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సత్యదేవ్… జ్యోతిలక్ష్మితో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. హీరోగా బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు అతనికి మంచి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు మళ్లీ హీరోగా కెరీర్ టర్న్ చేయాలనే లక్ష్యంతో వస్తున్న సినిమా రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకత్వంలో, తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా గాడ్ ఫాదర్, కింగ్డమ్, జీబ్రా లాంటి కీలక అవకాశాలు అందుకుంటూనే, మరోవైపు హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న సత్యదేవ్‌కు రావు బహదూర్ కెరీర్‌లో కీలక మలుపు అవుతుందేమో చూడాలి.
నవీన్ చంద్ర : అందాల రాక్షసితో హీరోగా ఎంట్రీ ఇచ్చినసత్యదేవ్ ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్, బ్లైండ్ స్పాట్, లెవెన్, 28 డిగ్రీసెల్సియస్, షో టైమ్, మాస్ జాతర, కరాలి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. ఇప్పటివరకు ఆయనకంటూ ఒక స్ట్రాంగ్ పాత్ బ్రేకింగ్ మూవీ మాత్రం రాలేదు. టాలెంట్, వర్సటిలిటీ ఉన్న నటుడికి కావాల్సింది ఒక్కటే కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా.
