Site icon NTV Telugu

Siddhu Jonnalagadda : సిద్దూ ‘తెలుసు కదా’ టీజర్.. మూడు ముద్దులు.. ఆరు హగ్గులు..

Telusu Kada

Telusu Kada

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో  చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా  కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది.    పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.  ఒక సరికొత్త కథ, కథాంశంతో తెలుసు కదా వస్తున్నట్టు  యూనిట్ చెప్తూ వస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్ ను 11 తారీకున ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేసారు మేకర్స్. యూనిట్ చెప్తున్నట్టుగానే తెలుసు కదా.. ఇద్దరి హీరోయిన్స్ ను ఒకేసారి లవ్ చేయడం వారితో రొమాన్స్ చేయడం వంటి కాన్సెప్ట్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పర అంగీకారంతో హీరోను లవ్ చేయడం వంటి రొమాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. టీజర్ లో అసలు కథ ఏంటో చెప్పేసారు. అలానే రాశి కన్నా, సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా దట్టించారు. పోటా పోటీగా అందాలు ఆరబోశారు రాసి, శ్రీనిధి. ఇక  70% ఏంజెల్ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీజర్ కు తమన్ ఇచ్చిననేపధ్య సంగీతం బాగుంది.  ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయినా మల్లిక గంధ ఫస్ట్ లిరికల్ సాంగ్ కు చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ కానుంది

 

Exit mobile version