Devi Sri Prasad: ‘పుష్ప’ పాటలతో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, ఈసారి అంతకుమించిన హై-ఓల్టేజ్ మాస్ విధ్వంసానికి రంగం సిద్ధం చేశారు. ‘బలగం’ సినిమాతో హృదయాలను కదిలించిన దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ చేసిన ఒక అన్‌బిలీవబుల్ మ్యూజికల్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఎల్లమ్మ’ టైటిల్ ట్రాక్ కోసం డీఎస్పీ గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ ప్రయోగం చేశారు. కేవలం కంప్యూటర్ బీట్స్, ఆర్టిఫిషియల్ సౌండ్స్‌పై ఆధారపడకుండా.. దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే దాదాపు 100 మంది ఒరిజినల్ జానపద రిథమ్ కళాకారులను ఒకే దగ్గరకు తీసుకొచ్చారు. వారందరితో కలిసి లైవ్‌లో ఈ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేయించారు. 100 మంది వాయిద్యకారుల దరువులతో సాగే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం పక్కా అని సమాచారం.
ఈ సెన్సేషనల్ టైటిల్ సాంగ్‌ను ‘ఫస్ట్ సింగిల్’ రూపంలో త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) పతాకంపై దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మురళి జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. వేణు ఎల్దండి ఎమోషనల్ కథనానికి తోడు, డీఎస్పీ సృష్టించిన ఈ జానపద శబ్దం బాక్సాఫీస్ వద్ద మరోసారి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Rockstar 🌟 @ThisIsDSP records the #Yellamma title song with 100 folk rhythm artists representing diverse cultures across India! 🔥🥁
FIRST SINGLE SOON ❤️🔥❤️🔥
In Cinemas #YellammaFromMarch5th 💥
@VenuYeldandi9 #DilRaju #Shirish @HR_3555 @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official @Tseries @tseriessouth
— Sri Venkateswara Creations (@SVC_official) October 30, 2026

