Site icon NTV Telugu

‘లక్కీ స్టార్’గా కన్నడ రాక్ స్టార్ యశ్

Yash Kannada Movie to Dubbed in Telugu

‘కె.జి.ఎఫ్.’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో యశ్. అతను నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’ తెలుగులో ‘లక్కీ స్టార్’గా డబ్ అవుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. ఆమె సమర్పణలో శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నారు. డా. సూరి దర్శకత్వం వహించిన ‘లక్కీస్టార్’లో యశ్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్, కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘రాబర్ట్’ ఫేమ్ అర్జున్ జన్య సంగీతాన్నిఅందించిన ఈ సినిమాకు తెలుగులో మాటలు పాటలు గురుచరణ్ రాస్తున్నారు.

Read Also : ఎన్నికలపై అసత్య ప్రచారం! ఖండించిన ‘మా’!!

Exit mobile version