కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేసిన మేకర్స్.
Also Read : Bunny Vasu : అల్లు అర్జున్ – అట్లీ సినిమా మా చేతుల్లో లేదు
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ కన్నడ మీడియా సిర్కిల్స్ లో వినిపిస్తోంది. టాక్సిక్ సినిమాను పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి షూట్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా కోసం జాన్ విక్ సినిమాకు పని చేసిన దర్శకుడు కమ్ స్టంట్ మాస్టర్ JJ పెర్రీ పని చేస్తున్నాడు. 45 రోజుల యాక్షన్ మారథాన్ సినిమాకు హైలెట్ గా నిలవడమే కాదు ఇండియన్ యాక్షన్ సినిమాకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా రెడీ చేస్తున్నారట. హాలీవుడ్ దర్శకుడు, స్టంట్‌మ్యాన్ జెజె పెర్రీ, యష్ & గీతు మోహన్‌దాస్‌లతో పాటు మొత్తం టీమ్ ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు రిలీజ్ చేసింది టాక్సిక్ టీమ్. ఈ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే ఇందులో యష్ రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. అటు హీరోతో పాటు ఇటు విలన్ గా కూడా నటిస్తున్నాడేమో అని సందేహం కలుగుతోంది.