Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Favorite Songs: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో గీతూ మోహన్‌దాస్ యష్‌ను ఇప్పటి వరకు చూడని సరికొత్త అవతార్‌లో చూపించనున్నారని టాక్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 22న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. తెలుగులో తన ఫేవరెట్ సాంగ్స్ ఏంటో చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని దేఖో దేఖో గబ్బర్ సింగ్ తనకు తెలుగులో ఫేవరెట్ సాంగ్ అని వెల్లడించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన “శంకర్ దాదా జిందాబాద్” సినిమాలోని .. ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్ కూడా తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అన్ని దాదాపు వింటానని అన్నారు. ఇకపోతే ‘టాక్సిక్’ కథ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ 1940 నుంచి 1970 మధ్య కాలంలో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ కార్టెల్, అండర్‌వరల్డ్, అధికారం, నమ్మకద్రోహం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో యశ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..