Site icon NTV Telugu

‘బిలీవ్’తో జట్టు కట్టిన ‘ఎస్.పి మ్యూజిక్’

World leading digital music company "Believe Music" partnership with Suresh Productions

‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్. పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింది. వీరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్ ను వరల్డ్ మ్యూజిక్ డయాస్ పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్ కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ‘బిలీవ్ ఇండియా’ రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సౌత్ బేతోనూ జట్టు కట్టింది. బిలీవ్, ఎస్.పి. మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ మ్యూజిక్ కు కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు.

Read Also : ఈ యేడాది చివరిలో చిరు – బాబీ మూవీ సెట్స్ పైకి!

ఈ సందర్భంగా ఎస్.పి. మ్యూజిక్ ఎం.డి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, ”బిలీవ్ తో భాగస్వామి కావడం ఎస్.పి. మ్యూజిక్ కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్ కు ఉన్న ప్రపంచ స్థాయి నెట్ వర్క్ తో ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ లవర్స్ కు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ‘నారప్ప’ తో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. బిలీవ్ ఇండియా ఎం.డి. వివేక్ రైనా మాట్లాడుతూ “సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్ తో భాగస్వామి అవడం ఎగ్జైటింగ్ గా ఉంది. ‘నారప్ప’ మూవీ మా పార్టనర్ షిప్ లో ఫస్ట్ మూవీగా తీసుకున్నాం. బిలీవ్ కంపెనీ ద్వారా మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు డిజిటల్ పార్టనర్స్ కు ఇన్నోవేటివ్ మార్కెటింగ్, ఆడియెన్స్ గ్రోత్ వంటి అంశాల్లో సహకారం అందిస్తాం” అని చెప్పారు.

Exit mobile version