NTV Telugu Site icon

Tollywood: సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడి

Rape

Rape

సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. సినిమాల మీద పిచ్చితో రోజుకు చాలా మంది హైదరాబాదు వస్తూ ఉంటారు. అలా ఒక మహిళ మీద సినిమాల్లో ఛాన్స్ అంటూ అత్యాచార యత్నం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు నమోదు అయింది. ఆడిషన్స్ పేరుతో ఇంటికి పిలిచి అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి భర్తతో విడిపోయి మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండలో బంధువుల ఇంట్లో నివాసం ఉంటోంది ఓ మహిళ. అయితే ఇటీవల బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి అమీర్ పేట లోని హాస్టల్ లో చేరింది.

Saif Ali Khan: సైఫ్ రక్తంతో తడిసి, 8 ఏళ్ల కొడుకుతో సింహంలా నడుచుకుంటూ వచ్చాడు!

తనకున్న కొద్దిపాటి పరిచయాలతో 15 రోజుల కింద ఓ సినిమాలో హౌస్ కీపింగ్ ఆర్టిస్ట్ గా సదరు మహిళ పని చేసింది. అయితే ఆ సినిమాలో పని చేసిన కాటేకొండ రాజు అనే వ్యక్తి ఆమెకి సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేయాలని ఆసక్తి ఉండడాన్ని గమనించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చెప్పుకుని మహిళతో పరిచయం చేసుకున్న రాజు ఆడిషన్స్ పేరుతో కృష్ణానగర్ లోని హెవెన్ హోటల్ కు పిలిచి ఫోటోషూట్ చేసి రకరకాల ఫోటోలు తీశాడు రాజు. మరుసటి రోజు రావాలని చెప్పగా.. రెండో రోజు గదిలోకి వెళ్లిన మహిళ పై అత్యాచార యత్నం చేశాడు రాజు. ఈ క్రమంలో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజు పై BNS 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.