Site icon NTV Telugu

Rashmika : ఆ యంగ్ హీరో రష్మికకు బాలీవుడ్ లో హిట్ ఇస్తాడా?

Bollywood (1)

Bollywood (1)

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన థామా. టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సినీప్రేమికుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : JR NTR Fans : అనంతపురంలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

దినేష్ విజన్,  మాడ్డాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఈ యూనివర్స్‌లో స్త్రీ, ముంజ్యా లాంటి సూపర్ హిట్స్, స్త్రీ 2 కి వచ్చిన సక్సెస్, అలాగే భేడియా డిజాస్టర్ అయినప్పటికీ, మొత్తం కంటెంట్ మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇప్పుడు, థామా పైన ఆడియన్స్‌లో క్యూసిటీ పీక్‌లో ఉంది, ఇది హర్రర్ యూనివర్స్‌లో ఫస్ట్ రొమాంటిక్ కామెడీ. థామా తర్వాత, మాడ్డాక్ ఫిల్మ్స్ భారీ లైనప్ రెడీ చేసింది. ఈ లిస్ట్‌లో – శక్తి శాలిని, భేడియా 2, చాముండా, స్త్రీ 3, అలాగే మహాముంజ్యా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో, మాఢాక్ ఫిల్మ్స్ హర్రర్ యూనివర్స్ బాలీవుడ్‌లో అతిపెద్ద కనెక్టెడ్ ఫ్రాంచైజ్‌గా రికార్డ్ సెట్ చేయబోతోందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో యానిమల్, పుష్ప2, ఛావా తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నరష్మిక సల్మాన్ తో చేసిన సికిందర్ తో డిజాస్టర్ ఆమె ఖాతాలో వచ్చి చేరింది. ఇప్పుడు ఆయుష్మాన్ తో చేస్తున్న థామాతో సాలిడ్ హిట్ కొట్టి మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నరష్మికకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.

Exit mobile version