బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. బండ్ల గణేష్ నిర్మించింది నాలుగు సినిమాలే అయినా సూపర్ హిట్ సినిమాలు చేసాడు. కానీ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు పొలిటిక్స్ లో కూడా చేసాడు. సరే ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ సినిమాలకే కాదు అయన స్పీచ్ లకు కూడా అభిమానులు ఉంటారు. అది పొలిటికల్ స్పీచ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా సరే సెన్సేషనల్ స్పీచ్ ఇస్తూ సంచలనం సృష్టిస్తాడు బండ్ల.
Also Read : RazeshDanda : మీడియాకు, వెబ్ సైట్ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పిన K RAMP నిర్మాత
తాజాగా జరిగిన KRAMP చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో బండ్ల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ ‘ టాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే వాట్సాప్ వాట్సాప్.. ఏం కావాలి, అర్ధరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకునే ఈ రోజుల్లో హిట్ మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలాగా మారిపోయాడు కిరణ్ అబ్బవరం. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళ అద్దాలు పెట్టుకొని నడిచే ఈ రోజుల్లో కిరణ్ రియల్ గా ఉన్నాడు. కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవి గుర్తొస్తున్నారు. ఒక్క హిట్ కొట్టగానే SS రాజమౌళిని తీసుకునిరా, లోకేష్ కనకరాజ్ ను తీసుకుని రా. అనిల్ రావిపూడిని తీసుకుని రా అని చెప్పే హీరోలున్న ఈ రోజులల్లో కిరణ్ అబ్బవరం కొత్త కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ పరిశ్రమకు తీసుకొస్తున్నాడు. కిరణ్ అబ్బవరంని చూసి నేర్చుకోండి. అని అన్నారు. బండ్ల చేసిన ఈ వ్యాఖ్యలు వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఓ యంగ్ హీరో నుద్దేశించేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లోను ఆ హీరోకు బండ్లకు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఆ పేరు మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.
