NTV Telugu Site icon

Release Clash: పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?

Untitled Design (5)

Untitled Design (5)

ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా
ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది.

ఈ వినాయక చవితికి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ ను సెప్టెంబరు7న విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. మరోవైపు అదేవారంలో రెండు రోజులు ముందుగా సెప్టెంబరు 5న తమిళ స్టార్ విజయ్ నటించిన G.O.A.T  విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలిజ్ చేసారు. దింతో అటు తమిళ్, మలయాళం, తెలుగులో క్లాష్ వచ్చేలా ఉంది. కేరళలో విజయ్ vs సల్మాన్ ఫ్యాన్స్ మధ్య పోటీ నెలకొంటుంది. తమిళ్ లో విజయ్ సినిమాకే ఎడ్జె, దుల్కర్ సిసినిమాలకు కూడా డిమాండ్ ఉంది.

తెలుగులో ఈ చిత్రాల మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది. కారణం విజయ్ G.O.A.T చిత్రాన్ని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రైట్స్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థయిన మైత్రిమూవీస్ కొనుగోలు చేసింది. మైత్రికి రెండు స్టేట్స్ లో థియేటర్లు గట్టిగానే లాక్ చేస్తుంది. మరోవైపు లక్కీ భాస్కర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సీతారకు రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. నైజం దిల్ రాజు విడుదల చేస్తే మరోసారి హనుమాన్ నాటి పరిస్థితులు రావొచ్చు. నైజాంలో మైత్రి vs దిల్ రాజు గా వ్యవహారం మారుతుంది. థియేటర్ల కేటాయింపు సమస్యలు షరా మాములే. వీటితో పాటు తెలుగు హీరోల సినిమాలు ఉంటాయి. ఎవరెవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.  ఏ సినిమా అయిన టాక్ బాగుంటేనే నిలబడుతుంది.

 

Also Read: abbavaram movie : కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా ..?