Site icon NTV Telugu

Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!

Untitled Design (24)

Untitled Design (24)

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్  సినిమా చరిత్రలో ఏ హీరో  సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా  కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్  రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.

ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు అవుతారోనని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రేస్ లో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప తెలుగుతో పాటు నార్త్ బెల్ట్ లో అదిరే కలెక్షన్స్ రాబట్టింది. వీరి కాంబోలో రాబోతున్న పుష్ప -2తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని ట్రేడ్  టాక్. ఇక ‘RRR’తో సూపర్ హిట్ సాధించిన రామ్ చరణ్, jr.ఎన్టీయార్ లకు నార్త్ లో  మంచి మార్కెట్ ఏర్పడింది. శంకర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ఫై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కెలెక్షన్లు సాదించడం మ్యాటర్ కాదు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో  అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే  రూ.1000కోట్లు రాబట్టి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయనడంలో సందేహం లేదు.

Also Read :akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?

Exit mobile version