akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?
- బాలయ్య - బోయపాటిల సూపర్ సెన్సేషన్ అఖండ
- మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన తమన్
- బాల - బోయ కాంబోలో 4వ చిత్రంగా అఖండ -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది.
అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మ్యూజిక్ తో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్లాడు తమన్. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ను దద్దరిల్లే సౌండ్ తో అపురూపంగా మలిచాడు తమన్. ఓవర్సీస్ లో అఖండ సౌండింగ్ కు తమ థియేటర్లు తట్టుకోలేకున్నాయి సౌండ్ తగ్గించి ప్రదర్శిస్తాం అని సూచనలు చేసాయంటే అర్ధం చేసుకోవచ్చు అఖండకు తమన్ ఎంత వర్క్ చేసాడో. థియేటర్లను శివ నామ స్మరణతో మోత మోగించాడు తమన్.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కాగా అఖండ కు సిక్వెల్ అఖండ-2 (#BB 4)ను తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు బోయపాటి. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తమన్ అఖండ -2కు ప్రాజెక్ట్ కు వర్క్ చేయట్లేదని తెలుస్తోంది. స్కంధ మ్యూజిక్ విషయమై బోయపాటి, తమన్ మధ్య మనస్పర్థలు వచ్చాయని వాటి కారణంగా అఖండ-2 కు వీరు కలిసి పనిచేయట్లేదని టాక్. ఇటీవల అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సిక్వెల్ కు సంగీతం అందించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బోయపాటి క్లారిటీ ఇసాడేమో చూడాలి.
Also Read : Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..
తాజావార్తలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!