NTV Telugu Site icon

Kollywood : అందని ద్రాక్ష కోసం అరడజను సినిమాలు..

Kollywood

Kollywood

బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు  అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది.

Also Read : Dragon : డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్

కంగువాతో వెయ్యి కోట్లు  లేదంటే మాక్సిమమ్ రూ. 500 కోట్ల కలెక్షన్స్ ఎస్టిమేషన్ వేసుకున్నారు మేకర్స్. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అందుకే ఈ సారి నార్మల్ గ్యాంగ్ వార్ స్టోరీతో వస్తున్నాడు. విదాముయర్చితో అజిత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడనుకుంటే సినిమా తుస్సుమంది. ఇప్పుడు గోల్, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటి వరకు గట్టిగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చూడని అజిత్ ముందు బిగ్ టార్గెట్ ఊరిస్తోంది.  రోబో 2.0, జైలర్ ఈ రెండు మాత్రమే రూ. 600-800 క్రోర్ వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది వెయ్యి కోట్ల టార్గెట్  దానికి తగ్గట్లే, ఈ వయస్సులో కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. కూలీ, జైలర్ 2 చిత్రాలను దింపుతున్నాడు. విజయ్ కూడా లియోతో రూ. 500 క్రాస్ చేశాడు. జననాయగన్‍ తో ఆ మార్క్ టచ్ చేయాలని చూస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లో థౌజండ్ క్రోర్ కొల్లగొట్టే హీరో అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇక విక్రమ్ తో రూ. 400 క్రోర్ క్లబ్ లోకి చేరిన కమల్ థగ్ లైఫ్ లాంటి మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ జూన్ 5న రాబోతుంది. మణిరత్నం దర్శకుడ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎవరు ఆ ఫీట్ ను అందుకుంటారో చూడాలి.