తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన ఢీలా పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం కొంత బూస్ట్ ఇచ్చినా ‘గేమ్ ఛేంజర్’ దెబ్బ ఇంకా కోలుకునేలా చేయలేదు అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో, ఒక తెలుగు వెబ్ పోర్టల్ ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం దిల్ రాజును తీవ్రంగా కలవరపెట్టడంతో, ఆయన సీరియస్‌గా స్పందించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ వెబ్ పోర్టల్ కథనాన్ని తొలగించినప్పటికీ, ఈ ఘటన సినీ వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీసింది.వెంటనే ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశారు.
Sukumar : సుకుమార్ తో షారుఖ్ సినిమా..?
దిల్ రాజు తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సున్నితంగా భావిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమాచారం బయటకు రావడం, అందులోనూ ఆయన సినిమాల వైఫల్యాల గురించి, పేమెంట్స్ కి సంబంధించిన వివరాలు కూడా లీక్ కావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ లీక్స్ వెనుక ఎవరున్నారనే ప్రశ్న సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో దిల్ రాజుకు సన్నిహితంగా ఉండి, ప్రస్తుతం ఆయనకు దూరమైన వ్యక్తులే ఈ సమాచారాన్ని బయటపెట్టారని అనుమానిస్తున్నారు. ఈ ఊహాగానాలు నిజమేనా అనేది ఇంకా స్పష్టత రాకపోయినా, ఈ ఘటన ఆయనపై ఒత్తిడిని పెంచిందని స్పష్టమవుతోంది. ఈ లీక్స్ దిల్ రాజు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ సమాచారాన్ని బయటపెట్టింది ఎవరు? దీని వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి, ఈ వివాదం దిల్ రాజు అభిమానుల్లోనే కాక, సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్‌గా మారింది.