Site icon NTV Telugu

Tollywood : మన సినిమాలు.. మనకే తిరిగి చూపిస్తున్న ఇతర ఇండస్ట్రీలు

Tollywood

Tollywood

రామాయణ, మహాభారత గాధలను బ్లాక్ అండ్ వైట్ రోజులనుండి ఈస్ట్ మన్ కలర్ లో చూపించిన చరిత్ర టాలీవుడ్‌ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్నీ మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాధలను, భక్త ప్రహ్దాదలాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్‌పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజుతో పాన్ ఇండియా మోజులో పడి  ఎవరూ చూస్తారులే అని ఈ కథలను పక్కన పెట్టింది. కానీ ఇవే స్టోరీలపైనే ఫోకస్ చేస్తున్నాయి ఇతర ఇండస్ట్రీస్.

Also Read : Vijay Devarakonda : కింగ్డమ్ హిట్టా.. ఫ్లాపా.. విజయ్ కోరిక తీరిందా.. లేదా?

తెలుగులో భక్త ప్రహ్మాద కథను 1930లోనే తెరకెక్కించింది టాలీవుడ్. కానీ ఇప్పుడు అదే కథను యానిమేషన్ రూపంలో కన్నడ  ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించిన మహావతార్ నరసింహ అన్ని భాషల్లో ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జులై 25న రిలీజైన ఈ యానిమేషన్ డివోషనల్ ఫిల్మ్ ఐదు రోజుల్లో రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక బాలీవుడ్‌లో వచ్చిన ఆదిపురుష్ ఈ మధ్య వచ్చిన కన్నప్ప చిత్రాలు జెన్ జెడ్ తరానికి తెలియని తెలియదు కానీ ఒకప్పుడు టాలీవుడ్‌లో సంపూర్ణ రామాయణం, భక్త కన్నప్ప నుండి రూపుదిద్దుకున్నవే. ఇప్పుడు ఇదే రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్బాటాలతో ఏకంగా నాలుగు వేల కోట్లతో తెరకెక్కిస్తోంది. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్టుగా తీస్తానంటున్నాడు అమీర్ ఖాన్. ఇక హోంబలే నెక్ట్స్ ది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్టే రెడీ చేసింది. అంటే మనం ఆల్రెడీ తీసిన కథలనే మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ మైథలాజికల్ సినిమాలు చేస్తే తెలుగు సినిమా మరోసారి పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టడం కష్టమేమి కాదు.

Exit mobile version