అద్భుతమైన అమ్మాయి అంటూ ఓ చిన్నారిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అనే చేసిన పనికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఏం చేసిందనే కదా మీ డౌట్… అసలేం జరిగిందో స్వయంగా చిరంజీవే మాటల్లోనే… “పి.శ్రీనివాస్, శ్రీమతి హానీ గార్ల చిన్నారి కూతురు పేరు అన్షీ ప్రభల. జూన్ 1న తన బర్త్ డే.. తాను దాచుకున్న డబ్బులతో పాటు తన పుట్టినరోజుకు అయ్యే ఖర్చులను కూడా చిరంజీవి ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం ఇచ్చేసింది. ఈ సందర్భంగా తనేం అంటుందంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం అని. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు తాను వ్యక్తపరిచిన ఈ ప్రేమకు నిజంగా నేను ముగ్దుడిని అయిపోయాను. అన్షీ చూపిన ఈ స్పందన నా హృదయాన్ని తాకింది. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులు అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. వండర్ ఫుల్ కిడ్… గాడ్ బ్లెస్ యూ అన్షీ… హ్యాపీ బర్త్ డే.. లవ్ యూ డార్లింగ్” అంటూ ఆ చిన్నారి చేసిన మంచి పనిని ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిరు. ఇక కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి దీని పర్యవేక్షణ ఉంటుంది.
చిన్నారిపై చిరు ప్రశంసలు… ఏం చేసిందంటే ?
