NTV Telugu Site icon

Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?

Untitled Design (18)

Untitled Design (18)

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో.

విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు. కాగా ‘మెకానిక్ రాకీ’ సెట్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్‌ కు స్వాగతిస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్ . స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌ అల్ట్రా స్టైల్ లుక్ లో అదరగొడుతుంది.

భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నీదీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు నిర్మాత రామ్ తాళ్లూరి. అదే రోజున తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన అమరన్ విడుదల కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంది. ‘మెకానిక్ రాకి’ థియేట్రికల్ రైట్స్ ఏషియన్,సురేష్ కొనుగోలు చేసారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ మరియు విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read : NBK 109: బాలయ్య కూడా ఆరోజే వస్తే..దబిడి..దిబిడే..

Show comments